ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు పలు చోట్ల నుంచి ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం 84 సంఘాల్లో ఎన్నికలు జరుగుతుంటే, 751 స్థానాల్లో 1868 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 509 మంది డైరెక్టర్ల పదవులు ఇప్పటికే ఏకగ్రీవమైయ్యాయి. పోలింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ పూర్తవనుండగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : ఉత్పత్తి ఎక్కువ.. ఆదాయం తక్కువ..