TG Govt Sanctioned Funds To HYDRA : రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు విడుదల చేసింది. నగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్క్‌ల పరిరక్షణ, చెరువుల పునరుద్దరణ, విపత్తు నిర్వహణ కోసం పని చేస్తున్న హైడ్రాకు రూ.50 కోట్లను విడుదల చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కార్యాలయ నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలుతో పాటు ఇప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు ఈ నిధులు ఖర్చు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది.
అయోమయంలో హైడ్రా - చెరువులు, కుంటల లెక్క తెలియక సందిగ్ధం
త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్ - ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం : రంగనాథ్