Fake Certificate Issue In Hyderabad : నగరానికి చెందిన ఓ యువకుడు బీటెక్ మూడో ఏడాదిలో చదువు ఆపేశాడు. పూర్తిచేస్తే తెలిసిన ఐటీ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో ఫ్రెండ్. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని ప్రైవేట్ కన్సల్టెన్సీని సంప్రదించాడు ఆ యువకుడు. రూ.50 వేలిచ్చి బీటెక్ పూర్తిచేసినట్లుగా సర్టిఫికెట్లను సంపాదించాడు. బ్యాక్ డోర్‌లో ఉద్యోగం పొందినప్పటికీ పనితీరులో తేడాతో తేలికగా పట్టుబడ్డాడు.
థర్డ్ పార్టీ నిర్వహించిన తనిఖీల్లో అతడు అందజేసిన విద్యార్హతలు నకిలీవిఅని నిర్ధారించాక జాబ్ నుంచి తొలగించారు. పోలీసు కంప్లైంట్నకు సిద్ధమయ్యారు. అప్పటివరకు తీసుకున్న శాలరీని తిరిగి చెల్లించి బయటపడ్డాడు. నగరంలో నకిలీపత్రాల(ఫేక్ డాక్యుమెంట్ల) దందా యథేచ్ఛగా సాగుతోంది. విదేశీయానం, ఉద్యోగాల కోసమని నకిలీ వైపు ఆకర్షితులవుతున్న యువత అడ్డదారి ప్రయాణం ప్రమాదకరమని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోందని సూచిస్తున్నారు.
నగరంలో పెద్దఎత్తున నకిలీ సర్టిఫికెట్లు : డబ్బులుంటే కళాశాల గుమ్మం తొక్కకుండానే ఉన్నత చదువులు పూర్తిచేసినట్లుగా సర్టిఫికెట్లు చేతికిస్తారు. కొన్ని ప్రైవేటు కన్సల్టెన్సీలు తమ వద్దకు వచ్చే యువతీయువకుల అవసరాన్ని ఆసరా చేసుకొని నకిలీ డాక్యుమెంట్లను అంటగడుతున్నాయి. వేలాది మంది వీటితో దేశ, విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారని, ఉన్నత హోదాల్లో ఉన్నారని మభ్యపెట్టి మోసగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల పలుచోట్ల తనిఖీలు నిర్వహించి నకిలీ పత్రాలు(ఫేక్ సర్టిఫికెట్లు) విక్రయిస్తున్న ముఠాలను అరెస్ట్ చేశారు.
వీరి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 10వేల మంది నకిలీ ధ్రువపత్రాలను కొన్నట్లుగా అంచనాకు వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీలు, పదో తరగతి, ఇంటర్ బోర్డులు జారీ చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటకలలోని ప్రధాన విద్యాసంస్థలు, విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కమీషన్ ఆశ చూపి అక్కడ నుంచి ఖాళీ మార్కుల షీట్లు, టీసీలు, ప్రొవిజన్ లాంటి వాటిని సేకరిస్తున్నారు.
కొలువుకు అడ్డదారి.. చిక్కితే కటకటాలే : గ్రేటర్ పరిధిలో ఇటీవల నకిలీపత్రాల(ఫేక్ డాక్యుమెంట్లు) దందా నడుపుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పత్రాలు కొనుగోలు చేసిన వారి డీటైల్స్‌ను సేకరించారు. సుమారు 20 మంది విదేశాలకు వెళ్లగా 100 మందికిపైగా ఐటీ, ప్రవేట్ కంపెనీల్లో జాబ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. సుమారు 10 మంది పని చేస్తున్న కంపెనీలకు నకిలీ పత్రాలపై పోలీసులు సమాచారం అందజేసినట్లు తెలిసింది. ఈ ముఠాల గుట్టు బయట పడగానే వీరి వద్ద ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన కొందరు తమ కెరీర్, జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ పోలీసు ఆఫీసర్స్‌ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. తమ గుట్టు బయటపడితే కుటుంబాల్లోనూ కలతలు తలెత్తే ప్రమాదం ఉందంటూ ఓ బాధితుడు ఓ రాజకీయ నాయకుడి ద్వారా పోలీసు అధికారులకు సిఫారసు చేయించినట్లుగా సమాచారం.111
'డబ్బులిస్తే చాలు ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తారు..'
Fake Certificates: నకిలీ సర్టిఫికేటుగాళ్లు అరెస్ట్.. కంప్యూటర్లు, స్టాంపులు స్వాధీనం