MS Dhoni Dance Video Viral : క్రికెట్ స్టేడియంలో తన ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ. తన బ్యాట్‌తో చాలా మంది క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. కీపింగ్ మాయాజాలంతో ఆకట్టుకోవడంతో పాటు అద్భుతమైన నాయకత్వంతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
అయితే ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు మహీ. తాజాగా తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఓ వేడుకలో తన భార్య సాక్షితో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, గత కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు ధోనీ. ఈ క్రమంలోనే రిషికేష్‌లోని స్థానికులతో కలసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు మహీ. పహాడీ, గులాబీ షరారా అనే జానపద పాటలకు స్థానికులతో కలసి ధోనీ-సాక్షి దంపతులు చిందులేశారు. వీరిద్దరూ ట్యూన్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకోవడం విశేషం.
ఈ వేడుకలో స్థానికులంతా అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించారు. ధోనీ దంపతులు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. వీరిద్దరు చేతులు పట్టుకొని బాణీకి తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు మహిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని తెగ ఆశ్చర్యపోతున్నారు. 'మాహీకి అసలే సిగ్గు ఎక్కువ, కానీ ఫ్యామిలీ కోసం స్టెప్పులు వేయడం తప్పలేదేమో' అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలానే మాహీ డ్యాన్స్‌తో అదరగొట్టాడని, డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయని అంటున్నారు.
WATCH: MS Dhoni along with his wife Sakshi Singh grooves on Pahadi songs in Rishikesh#MSDhoni #IPL2025 #Rishikesh https://t.co/0lOHTe6c1l pic.twitter.com/GfTCBvwJq3
— Sports Tak (@sports_tak) December 3, 2024
Dhoni Career : ఇకపోతే కొన్నేళ్ల క్రితమే మెన్ ఇన్ బ్లూకు గుడ్‌బై చెప్పేసిన మహీ, క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో మాత్రం ఇంకా కెరీర్ కొనసాగిస్తున్నాడు. సీఎస్కే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అలానే క్రికెట్ లేని సమయంలో ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయ పనులు చేయడంతో పాటు ఫ్యామిలీతో కలసి సరదాగా గడుపుతుంటాడు.
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇతడు - 70 వేల కోట్ల ఆస్తి! - 22 ఏళ్లకే రిటైర్మెంట్!
ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్ - ఇప్పుడేమో టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డ్