ప్రజలంతా ప్రతీ ఆదివారం 10 గంటల 10 నిముషాల కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్ పేర్కొన్నారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీల్లో కలియ తిరుగుతూ మురికి కాలువలను శుభ్రం చేయించారు.
ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కోరారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి అంటు వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. నీటి నిల్వలు తొలగించి దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య