ETV Bharat / state

సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలి: భాజపా శ్రేణులు - దుబ్బాక ఉప ఎన్నిక 2020

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై పోలీసులు అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bjp protest inn siddipet
భాజపా నేతలు ఆందోళన
author img

By

Published : Oct 27, 2020, 3:06 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్​పై అకారణంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకలో ఓటమి భయంతో తెరాస ప్రభుత్వం ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని కమలం నాయకులు ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా.. భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన భాజపా నేతలు.. సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.