ETV Bharat / health

జలుబు, దగ్గుతో ఇబ్బందా? రాత్రి నిద్ర కూడా పట్టట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా తగ్గే ఛాన్స్! - HOW TO TREAT COLD COUGH AT HOME

-దగ్గు, జలుబు సమస్యలకు ఇంట్లోని పదార్థాలతో పరిష్కారం -చలికాలంలో ఇబ్బంది పెట్టే సమస్యలకు ఈజీగా విరుగుడు!

Cold Cough Home Remedies
Cold Cough Home Remedies (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 29, 2024, 2:11 PM IST

Cold Cough Home Remedies: చలికాలం వచ్చిందంటే.. చాలా మందిని దగ్గు, జలుబు వంటి సమస్యలు వేధిస్తుటుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. అయితే, మన వంటింట్లోని కొన్ని పదార్థాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసమే కొన్ని చిట్కాలను పంచుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మరి అవేంటో చూద్దాం రండి.

  • అల్లం, తేనెతో కలిపి చేసే టీ తాగడం వల్ల దగ్గుతో పాటు జలుబు తగ్గేందుకు సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో Journal of Alternative and Complementary Medicineలో ప్రచురితమైన "Honey and ginger, a natural remedy for cold and cough" అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇందులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్ గుణాలు.. దగ్గు, జలుబు తగ్గించడంలో సాయపడతాయని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
  • ఇంకా 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్‌ చొప్పున వాము, పసుపు, మెంతులు, 4-5 నల్ల మిరియాలు నీటిలో వేసి మరిగించాలట. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
  • ఇంకా కొద్దిగా పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలని చెబుతున్నారు.
  • ప్రతి రోజు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలని అంటున్నారు. లేకపోతే తులసి ఆకులు నమలినా మెరుగైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
  • రోజు వారీ ఆహారంలో ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ, కివీ మొదలైన పండ్లను భాగం చేసుకోవాలని వివరిస్తున్నారు.
  • ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగయ్యేందుకు గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు.
  • ఏమైనా గొంతు సమస్యలున్నవారు తేనెను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
  • ఈ సమస్య పరిష్కారానికి మనం రోజు తీసుకునే సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, లెమన్‌ టీలు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
  • ఇంకా గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
  • గొంతునొప్పి వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
  • ఈ చిట్కాలతో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంతవరకు ఇంట్లో వండిన, తేలికగా ఉండే ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'పెరుగు ప్యాక్​తో జుట్టుకు మెరుపు'- డాండ్రఫ్ సమస్యకు చెక్!

ముక్కుపై గరుకుగా తగులుతున్నాయా? అసలెందుకు వస్తాయి? ఎలా తగ్గించుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.