ETV Bharat / state

రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం - ఎందుకో తెలుసా? - TELANGANA ASSEMBLY SESSION

రేపు శాసనసభ ప్రత్యేక సమావేశం - ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్

Telangana Assembly Session 2025
Telangana Assembly Session Arrangements (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 2:27 PM IST

Telangana Assembly Session Arrangements : రేపు తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం రేపు ప్రత్యేకంగా సమావేశమవుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గతంలాగానే ఈ సమావేశాలు సజావుగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచించారు.

మన్మోహన్‌ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ : ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 16 నియమం కింద గల రెండో నిబంధన అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు : మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలను పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాపదినాల్లోనే శాసనసభ సమావేశం పెట్టి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది . శాసనసభ శీతాకాల సమావేశాలు ఇదే నెలలో 9 నుంచి 21వ తేదీ వరకు జరిగాయి.

మంత్రిమండలి సమావేశం వాయిదా : శాసనసభ ప్రత్యేక సమావేశం దృష్ట్యా ఈ నెల 30న జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గతంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నా సంతాప దినాలు ఉండటం వల్ల దానిని నిర్వహించరాదని నిర్ణయించుకుంది. జనవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.

ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్​ అంత్యక్రియలు- ఆర్థిక సంస్కర్తకు కన్నీటి వీడ్కోలు

మన్మోహన్ సింగ్‌కు కేంద్ర కేబినెట్ ఘన నివాళి - శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.