ETV Bharat / entertainment

256 ఫీట్ల రామ్​చరణ్​ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి! - RAM CHARAN GAME CHANGER

విజయవాడలో రామ్​చరణ్ కటౌట్- 256 ఫీట్ల ఎత్తు!

Ram Charan  Cut Out
Ram Charan Cut Out (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 2:21 PM IST

Ram Charan 256 Feet Cut Out : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. 2025 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్​ విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌ లుక్‌) కటౌట్‌ ఏర్పాటు చేశారు.

చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు వారం రోజులు శ్రమించి ఈ కటౌట్ రూపొందించారని అభిమానులు తెలిపారు. దేశంలో ఇదే అతి పెద్ద కటౌట్ అని మెగా ఫ్యాన్స్ చెప్పారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇదే గ్రౌండ్స్​లో స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు సహా, గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ హాజరుకానున్నట్లు తెలిసింది.

ట్రైలర్ అప్పుడే
ఇటీవల మేకర్స్​ అమెరికాలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్​కు అక్కడ మంచి స్పందన లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓ చోట 2025 జనవరి 4న ఈ ఈవెంట్​ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే, సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా పాటల్లో శంకర్ మార్క్ కనిపించింది. ఈ సినిమాలో రామ్​చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటులు యస్​ జే సూర్య, అంజలీ, శ్రీకాంత్, సునీల్, ప్రకాశ్ రాజ్, జయరామ్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు.

రిలీజ్​కు ముందే 'గేమ్ ఛేంజర్' దూకుడు - బాలయ్య సినిమాను వెనక్కినెట్టి!

చెర్రీ, కియారా అదిరిపోయే లుక్స్! - శ్రేయ, కార్తిక్ పాడిన 'నానా హైరానా' విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.