ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని అర్చకులు శనివారం సాయంత్రం మూసివేశారు. సూర్యగ్రహణం సందర్భంగా ప్రదోషకాల పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేశారు.
ఆదివారం ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి సూర్యగ్రహణం మొదలవుతుందని మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుందని ఆలయ అర్చకులు సత్యం తెలిపారు. గ్రహణం సందర్భంగా భక్తులెవరికీ అనుమతి లేదని వివరించిన అర్చకులు.. సోమవారం సంప్రోక్షణ అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.