ETV Bharat / state

తాళాలు ఇచ్చి ప్రేమికుడితో చోరీ చేయించిన యువతి - a man theft

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో దొంగతనం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలి ఇంట్లో 10 లక్షలకుపైగా విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశాడో ప్రబుద్ధుడు. తీరా చూస్తే ప్రియురాలి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

తాళాలు ఇచ్చి ప్రేమికుడితో చోరీ చేయించిన యువతి
author img

By

Published : Nov 23, 2019, 11:59 PM IST

ప్రియురాలి ఇంట్లో బంగారు ఆభరణాలను చోరీ చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 10 లక్షల 25 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీ ఆర్టిస్ట్​గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేశవ్​ కుమార్ హన్మకొండలోని కుమారపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

కేశవ్​ కుమార్​ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆర్థికంగా లబ్ధి పొందాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంటి తాళాలు ప్రేమికుడికి ఇచ్చి తల్లితో కలిసి కాళేశ్వరం వెళ్లింది. అదే అదనుగా కేశవ్​ కుమార్​ బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఉదయం పాలు పోసే వ్యక్తి గమనించి పక్కింటి వాళ్లకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... యువతిపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది.

తాళాలు ఇచ్చి ప్రేమికుడితో చోరీ చేయించిన యువతి

ఇవీ చూడండి: విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

Intro:Tg_wgl_03_23_prema_musugu_lo_chori_ab_ts10077

Body:యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఇంట్లో బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందితుడును వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 10 లక్షల 25 వేల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన కేశవకుమార్ హన్మకొండలోని కుమారపల్లి కి చెందిన యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి మధ్య ప్రేమగా మారడంతో యువతి దగ్గరి నుంచి పలుమార్లు ఆర్ధికంగా లబ్ది పొందాడు. నేను నష్టాల్లో ఉన్నానని ఆర్ధికంగా సహకరిస్తే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మబలికాడు. అయితే రెండు రోజుల క్రితం యువతి తన తల్లితో కలిసి తెల్లవారుజామున కాళేశ్వరం వెళ్లే ముందు ఇంటి తాళాలు ప్రేమికుడి ఇచ్చి తల్లితో కలిసి వెళ్ళింది. దీంతో ప్రియుడు ఇంట్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేసాడు. ఈక్రమంలో ఉదయం పాలు పొసే వ్యక్తి చోరీ జరగడం గమనించి పక్కవాళ్ళకి చెప్పాడు. చోరీ జరిగిన విషయం కాళేశ్వరం బయలు దేరిన వారికి చెప్పడంతో వారు మాధ్యలోనే తిరిగివచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వివరాలు సేకరిస్తుండగా యువతి తన తల్లితో కలిసి ఏమి తెలియనట్టుగా నటించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు విషయం బయట పడింది.....బైట్
నాగరాజు, వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ .

Conclusion:donga arrest
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.