వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని నూర్జహాన్పల్లెలో జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి అకస్మిక తనిఖీ నిర్వహించారు. మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరిగ్గా పనిచేయకపోతే చర్యలుంటాయని సర్పంచ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ప్లాస్టిక్ కవర్లు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించారు.