రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ హరిత సుడిగాలి పర్యటనలు చేశారు. పరకాల, నడికుడ మండలాల్లో పల్లె ప్రగతి నిర్మాణాలపై ఆరా తీశారు.
పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డుల నిర్మాణం, ఇంకుడు గుంతల తవ్వకం, వైకుంఠ ధామాలు ఏర్పాటుకోసం గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు.
ఇవీచూడండి: 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!