వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విన్నవించారు. జనగామ జిల్లా కొడకండ్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రితో వర్ధన్నపేటలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే రమేష్ చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను కూలంకషంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి.. ఆస్తి పన్ను వడ్డీ రాయితీ పథకం నవంబర్ 15కు పొడగింపు