ETV Bharat / state

పసునూరికి దేవాదుల కార్మికుల నిరసన సెగ - compaign

వరంగల్ గ్రామీణ జిల్లా దేవాదుల వద్ద తెరాస నేతలకు నిరసన సెగ తగిలింది. పంప్​హౌస్​ కార్మికులు, స్థానికులు తెరాస నేతలపై ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి చర్యలు సరైనవి కావని ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించగా... తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ నచ్చచెప్పారు.

పసునూరికి నిరసన సెగ
author img

By

Published : Apr 5, 2019, 3:12 PM IST

స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గం దేవాదుల సమీపంలోని ధర్మసాగర్​కు వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారానికి వెళ్లారు. లోక్​సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటెయ్యాలని ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
తమ సమస్యలు పట్టించుకోకుండా ఎలా ఓట్లు అడిగేందుకు వచ్చారని నిలదీశారు. జీతాలు సరిగా చెల్లించడం లేదని పంప్​హౌస్ నిర్మాణ కార్మికులు వాపోయారు. తమను పర్మినెంట్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఫ్లెక్సీ పెట్టి ఆందోళన చేపట్టారు. వీరికి స్థానికులు కూడా తోడయ్యారు. కార్మికుల తీరుపై ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో ఇలాంటి నిరసన సరైనది కాదని.. ఆపకపోతే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.
ఈ హెచ్చరికలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, ఇతర తెరాస నేతలు స్పందించారు. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని నచ్చచెప్పారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని దయాకర్ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే'

Intro:TG_WGL_11_05_TRS_MP_CANDIDATE_PRACHARAM_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘనపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి తెరాస ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రచారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో తాగునీరు, ఆసరా పింఛన్ వంటి పలు సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం వహించడం తో ఆ ప్రభావం ప్రచారానికి వచ్చిన అభ్యర్థి మరియు ఎమ్మెల్యేలపై పడుతుంది. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా తమ సమస్యలపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోక్ సభ ఎన్నికలు ఇంచార్జ్ కన్నేబోయిన రాజయ్య యాదవ్ నిరసన చేసే వారికి సర్ది చెప్పి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ధర్మసాగర్ దేవాదుల పంప్ హౌస్ లో పనిచేస్తున్న కార్మికులు తమకు జీతాలు చెల్లించడం లేదని...... తమను పర్మినెంట్ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే వారిపైన ఆగ్రహించారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి నిరసన సరైనది కాదని.... నిరసన ఆపకపోతే వారిపై చర్యలుంటాయని కార్మికులను హెచ్చరించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని ప్రజలను కోరారు.

bytes...

కన్నేబోయిన రాజయ్య యాదవ్, నియోజకవర్గ లోక్సభ ఎన్నికల ఇంచార్జ్.

తాటికొండ రాజయ్య, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే.

పసునూరి దయాకర్, వరంగల్ లోక్సభ తెరాస ఎంపీ అభ్యర్థి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.