ETV Bharat / state

Spurious Seeds Selling In Hanamakonda : నకిలీ విత్తనాలు అమ్మాడు.. నట్టేట ముంచాడు.. 300 ఎకరాల సాగు వృధా - రాయపర్తిలో నకిలీ విత్తనాలు

Spurious Seeds Selling In Hanamakonda : పొలం పండిచుకునే రైతుల దగ్గరకు వచ్చి ఈ విత్తనాలు వాడి చూడండి.. అధిక దిగుబడి ఉంటుంది. ఎలాండి పురుగు పట్టదు.. కొత్త రకం విత్తనాలు కాయలు పెద్దగా వస్తాయి అని చెప్పగానే ప్రతి రైతన్న ఆశపడతారు... అదే అసరాగా చేసుకున్నాడో వ్యక్తి. కొత్త రకం మిర్చి విత్తనాలు.. అంటూ రైతులందరి నమ్మించి మోసం చేశాడు. పంట వేసి రెండు నెలలు కావొస్తున్నా పంట చేతికి రాకపోవడంతో.. రైతులు మోసం పోయామని గ్రహించారు.

Spurious Seeds Selling
Spurious Seeds Selling In Hanamkonda
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 7:52 PM IST

Spurious Seeds Selling In Hanamkonda నకిలీ విత్తనాలు అమ్మాడు.. నట్టేట ముంచాడు.. 300 ఎకరాల సాగు వృధా

Spurious Seeds Selling In Hanamkonda : ప్రభుత్వం నకిలీ విత్తనాల కట్టడికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. కొన్ని చోట్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. కొత్త రకం మిర్చి అధిక పురుగు పట్టదు.. కాయలు పెద్దగా వస్తాయి.. మంచి దిగుబడి ఇస్తుందంటూ ఓ దళారి.. ఊళ్లోకి వచ్చి రైతులను నమ్మించాడు. మిర్చి విత్తనాలు అంటగట్టి చేతులు దులుపుకున్నాడు. నమ్మి సాగు చేసిన ఆ రైతులు మొక్క పెరగక ఎలాంటి దిగుబడి లేకపోవడంతో మోసపోయామని గ్రహించి.. లబోదిబోమంటున్నారు.

Spurious Seeds In Telangana : ఇంకెనాళ్లీ నకిలీ విత్తనాల బెడద.. రైతుకు భరోసా లేదా?

హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తికి చెందిన కొందరు రైతులు.. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మిర్చి రకాన్ని సాగు చేసి నిండా మునిగారు. రత్నాకర్ రెడ్డి అనే వ్యక్తి రాయపర్తి రైతుల దగ్గరకు కొత్త రకం మిర్చి విత్తనాలు.. అధిక దిగుబడి వస్తుందని (Spurious Seeds ) రైతులని నమ్మించాడు. స్టాక్ ఎక్కువగా లేదు.. రేపో మాపో అయిపోతదని రైతులకు మాయమాటలు చెప్పాడు. ముందే అడ్వాన్సుగా వారి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని.. వరంగల్​లోని ఓ ప్రైవేటు ట్రేడర్ దుకాణంలో కొనుగోలు చేయించి.. నకిలి విత్తనాలు అంటగట్టి చేతులు దులుపుకున్నాడు. అధిక దిగుబడి వస్తదన్న ఆశతో సాగు చేసిన రైతన్న.. మోసపోయామని తెలుసుకుని.. ఏం చేయాలో పాలు పోక ఆవేదన చెందుతున్నారు.

Fake Cotton Seeds In Telangana : తెలంగాణ రైతుపై "నకిలీ విత్తనం" పడగ

"అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. అందుకు 33 ప్యాకెట్లు తీసుకున్నాను. రెండు పంటలు వేశాను అవి మొత్తం పుచ్చు వస్తున్నాయి. మొక్కలకు మొత్తం బొబ్బరు తెగులు వస్తుంది. ఈ రత్నాకర్ అనే వ్యక్తి ద్వారానే మేము ఈ విత్తనాలను కొనుగోలు చేశాము. వేరే విత్తనాల కంటే ఇది అధిక దిగుబడి వస్తుందని నమ్మించి.. రైతులను మోసం చేశారు. దీనికోసం అతనికి ఫోన్ చేసి రమ్మంటే నేను రాను కావాలంటే నాపై కేసు వేసుకో.. నన్ను ఎవరూ పిలవొద్దు అని అంటున్నాడు" - బాధిత రైతులు

Huge Farmers Lost By Spurious Seeds In Hanamkonda : గ్రామంలో ఎక్కవ మంది రైతులు ఆ రకానికి చెందిన విత్తనాలనే కొన్నారు. దాదాపు 300 ఎకరాల్లో ఈ విత్తనాలనే సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి.. నకిలీ విత్తనాలు అమ్మిన రత్నాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే పురుగుల మందే శరణ్యం అంటున్నారు. విత్తనాలు ఇచ్చిన ట్రేడర్ కంపెనీకి సమాచారం ఇస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి నకిలీ విత్తనాలు అంటగట్టిన వారిపై.. అమ్మిన ట్రేడర్​పై.. చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Task force Teams to Control Fake Seeds : నకిలీ విత్తనాల కట్టడికై ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందాలు

Home Minister on Spurious Seeds : 'ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.