గత వేసవితో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో సగటున ఏకంగా ఏడు మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. నిరుడు అక్టోబర్‌తో పోలిస్తే 3.7 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే 1.16 మీటర్ల మేర పెరుగుదల నమోదైంది.
పదేళ్ల సగటు చూస్తే ఈ అక్టోబర్ నెలలో మొత్తం 543 మండలాల్లో భూగర్భ జలాల పెరుగుదల ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే 53 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భజలాల సగటు మట్టం 4.22 మీటర్లుగా ఉందని భూగర్భ జలవనరుల శాఖ పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో కేవలం 0.91 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా... సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 13.52 మీటర్ల లోతులో ఉన్నాయి.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు