వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని శైవక్షేత్రాల్లో శివరాత్రి జాగారం నిర్వహించడానకి భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
పరకాలలోని కుంకుమేశ్వర ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాలాభిషేకాలు, శాంతి కల్యాణం ఘనంగా జరిగాయి. శివున్ని నగర వీధులలో ఉరేగిస్తూ శోభ యాత్ర చేశారు.