వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని ఎమ్మెల్యే కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరకాల పట్టణం మరింత అభివృద్ధి చెందిందన్నారు. పరకాల పట్టణాన్ని సుందరీకరణ, అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ప్రణాళికలు చేపట్టినట్లు.. అందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించినట్లు చల్లా తెలిపారు.
ఇదీ చూడండి : మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..