ఓ వైపు లాక్డౌన్.. మరోవైపు ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు దిగులు పడుతున్న వేళ అన్నదాతలను పోలీసులు ఆదుకున్నారు. రైతులపై ఉన్న అంకిత భావంతో పర్వతగిరి సీఐ పూల్యాల కిషన్ ఆదేశాల మేరకు ఎస్సై ప్రశాంత్బాబు రైతులు పండించిన మొక్కజొన్నలను తరలించడానికి రెండు లారీలు, 25 ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా రవాణా చేయడానికి స్థానిక రైతులు పడే ఆవేదనను చూసి సీఐ పూల్యాల కిషన్ స్పందించారు.
వెంటనే ధాన్యం తరలింపు కోసం వాహనాలు ఏర్పాటు చేయాలని ఎస్సై ప్రశాంత్, సిబ్బందిని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఎస్సై వరంగల్ ట్రాన్స్పోర్ట్ యజమానులతో మాట్లాడి.. వాహనాలను సిద్దం చేసి ధాన్యాన్ని మార్కెట్కు తరలించారు. స్థానిక రైతులు పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం సమావేశం