ETV Bharat / state

'రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం' - రైతులకు నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సు

రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలంలోని రైతులకు నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Parakala MLA Challa Dharma reddy Awareness to farmers on Cultivation of Controlled Crops in Warangal Rural district
'రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం'
author img

By

Published : May 26, 2020, 9:45 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా గీసుకొండ మండల రైతులకు నియంత్రిత పంటల సాగుపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భూసారాన్ని బట్టి అధికారులు సూచించిన పంటలను వేసుకొని రైతులు అధిక దిగుబడి సాధించాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

రైతు బంధు, రైతు బీమా పథకాలు రద్దవుతాయని కొందరు దుష్ప్రచారానికి దిగుతున్నారని... అలాంటి వారిని రైతులు నమ్మవద్దని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నది జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించి మెట్ట ప్రాంతాలను సుభిక్షం చేస్తున్నారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.