వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని, ప్రతి ఒక్కరూ టీకాపై అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలందరూ మాస్కు ధరించాలని.. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో రికార్డుస్థాయి కేసులు.. ఒక్కరోజే 4,446 మందికి పాజిటివ్