మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడో చోట తాగునీరు వృథా అవుతూనే ఉంది. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి వద్ద పైప్లైన్ లీకైంది. సుమారు ఆరు గంటలుగా నీరు ఎగిసిపడుతున్నా.. అధికారులు అటువైపు చూడనే లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వంచనగిరి పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారిపైకి నీరు చేరి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
కాకతీయ కాలువ సమీపంలో ఉన్న మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారని.. ఫలితంగా మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం