వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కొయ్యడ శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా గెలుపొందారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగాయి. జిల్లా నుంచి అధ్యక్షుడి పదవి కోసం నలుగురు పోటీ చేశారు. ఎన్నిక్లలో కొయ్యడ శ్రీనివాస్ 2,278 ఓట్లు సాధించారు. మిగతా ముగ్గురికి వరుసగా 1054, 867, 220 ఓట్లు దక్కాయి.
కొయ్యడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా విద్యార్థి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పేదరికంలో పుట్టిన అతను పార్టీ కోసం కష్టపడుతూ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ ఎలాంటి ఆదేశాలు, కార్యక్రమాలు ఇచ్చినా అహర్నిశలు కృషి చేసి ఒక మంచి కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు.
గెలుపు కోసం తనకు సహకరించిన దొంతి మాధవ రెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఇనగాల వెంకట్రామ్రెడ్డి, పీసీసీ కమిటీ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి దొమ్మటి సాంబయ్య, ఓటేసి గెలిపించిన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టెలీహెల్త్..