ETV Bharat / state

'మండవను కలవడం తెరాస బలహీనతకు సంకేతం'

author img

By

Published : Apr 7, 2019, 5:01 PM IST

రాజకీయాల్లో మార్పు రాకుండా అభివృద్ధి సాధ్యంకాదు. కాబట్టి ఈసారి మేము బంగారు తెలంగాణ కోసం మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తున్నాం. వరంగల్ అభ్యర్థి మహీపతి అనిల్ కుమార్, ఖమ్మం అభ్యర్థి తుమ్మగంటి శంకర్​లను భారీ మెజార్టీతో గెలిపించండి: కోదండరాం, తెజస అధ్యక్షుడు

'మండవను కలవడం తెరాస బలహీనతకు సంకేతం'

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తి మండవ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం అనేది కేసీఆర్ బలహీనతకు సంకేతమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. నిజామాబాద్​లో ఎక్కడ ఓడిపోతానన్న భయంతో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రకరకాల కారణాల చేత ఓట్లు పొందినప్పటికీ... ప్రజల మనసులను మాత్రం గెలుచుకోలేకపోయారని చెప్పారు. ఇలాంటి కారణాల వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయంగా ఎదిగేందుకు కేవలం 20 సీట్లు గెలుచుకున్న పార్టీ నాయకుల కోసం గల్లీ నుంచి హైదరాబాద్ వరకు తిరుగుతున్నారన్నారు. సంక్షేమం కోసం పాటు పడవలసిన రాజకీయాలు... వ్యాపారంగా మారాయని మండిపడ్డారు. అందుకే ఈ సారి మనకోసం, మన భవిష్యత్తు కోసం, మన రాజ్యాంగం కోసం ఓటు వేసి తెజస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'మండవను కలవడం తెరాస బలహీనతకు సంకేతం'

ఇవీ చదవండి: 'తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.