అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఖానాపురం మండలం అశోక్ నగర్లో దొడ్డు ధాన్యాన్ని తీసుకొస్తే కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు ధర్నాకు దిగారు. అనంతరం ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : తమ సంగతేందంటున్న ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులు