హైదరాబాద్లోని ముదిరాజ్ భవన్లో సమ్మె కాలంలో పని చేసిన ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ వ్యాప్తంగా 56 డిపోలకు చెందిన ఆర్టీసీ తాత్కాలిక కార్మికులు హాజరయ్యారు. తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
దాడులు జరిగినా బెదరలేదు..
సమ్మె సమయంలో తమకు ఉద్యోగ భద్రత విషయంలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరవడం దురదృష్టకరమన్నారు. తాత్కాలికంగా పని చేస్తున్న తమను సీఎం కేసీఆర్ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు తమపై ఆర్టీసీ కార్మికులు దాడులకు దిగారని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ