వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో అవినీతి తారస్థాయిలో ఉందని ప్రజలు ఆందోళన చేశారు. గురువారం జరిగిన గ్రామ సభకు గ్రామస్థులు రాకుండ అదే గ్రామానికి చెందిన ఒక వర్గం వారు అడ్డుకున్నారని వాపోయారు.
అవినీతిపై ప్రశ్నించిన వారిపై మూకుమ్మడి మాటల దాడికి దిగి నోరు మూయించారన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎన్ని గ్రామ సభలు జరిగినా అభివృద్ధి శూన్యమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి