వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వ టీచర్లు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. వారికి తమ వంతు సహాయంగా కొంత నగదును అందించారు. చిన్న కార్మికులైన వేతన జీవులపై ఈ దమనకాండ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలలుగా జీతాలు లేని ఆర్టీసీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకొని ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రశాంత్ పాక్‌లో ఉన్నట్లు ముందే సమాచారం