భారతదేశమన్నా, ఇక్కడి సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే మచ్చేంద్ర ఈ సారి ఉత్తరప్రదేశ్లోని కుంభమేళాకు వచ్చారు. అక్కడి నుంచి దక్షిణభారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓరుగల్లులోని వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు.
కంప్యూటర్లు లేని కాలంలోనే గొప్ప గొప్ప కట్టడాలను నిర్మించిన ఘనత భారతదేశానిదని కీర్తించారు. మహాశివరాత్రి దాకా ఇక్కడే ఉండి శ్రీశైల మల్లిఖార్జున్ని దర్శిస్తానని తెలిపారు. భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చినా తనివితీరదన్నారు.