వరిధాన్యాన్ని కోతల్లేకుండా కొనుగోలు చేయాలని... వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురంలో పాఖాల ఆయకట్టు రైతులు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1075 రకంతోపాటు పలు రకాల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. రైతులు నష్టాల్లో ఉన్నా... అధికారులు కనికరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'అన్ని రంగాలకు 24గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'