రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇదెలా సాధ్యమవుతుందని పొరుగు రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారని.. సీఎం కేసీఆర్ నిర్ణయాలను అమలుచేయడంతోనే లక్ష్యాలను సాధించామని మంత్రి వెల్లడించారు. ఇదంతా ఇష్టపడి పనిచేసే ఉద్యోగులతోనే సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇంజినీర్లకు ఇచ్చిన పదోన్నతులను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. నాలుగువేల మిలియన్ యూనిట్ల హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని దీని వల్ల ప్రభుత్వంపై రూ.700కోట్ల భారం తగ్గిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆయా యాజమానులు ఆర్థిక క్రమశిక్షణ... ఉద్యోగులు పనిలో క్రమశిక్షణ పాటించాలని ప్రభాకర్ రావు సూచించారు.
'అన్ని రంగాలకు 24గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ' - విద్యుత్ ఇంజినీర్ల డైరీ, గోడపత్రిక ఆవిష్కరణ
రైతులకు ఉచితంగా 24గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల సంఘం రూపొందించిన విద్యుత్ ఇంజినీర్ల డైరీ, గోడపత్రికను ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇదెలా సాధ్యమవుతుందని పొరుగు రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారని.. సీఎం కేసీఆర్ నిర్ణయాలను అమలుచేయడంతోనే లక్ష్యాలను సాధించామని మంత్రి వెల్లడించారు. ఇదంతా ఇష్టపడి పనిచేసే ఉద్యోగులతోనే సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇంజినీర్లకు ఇచ్చిన పదోన్నతులను వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. నాలుగువేల మిలియన్ యూనిట్ల హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని దీని వల్ల ప్రభుత్వంపై రూ.700కోట్ల భారం తగ్గిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆయా యాజమానులు ఆర్థిక క్రమశిక్షణ... ఉద్యోగులు పనిలో క్రమశిక్షణ పాటించాలని ప్రభాకర్ రావు సూచించారు.
TAGGED:
electrical engineers diary