ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారు సుమారు రెండు నెలల తర్వాత భక్తులకు కనువిందు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయాలకు భక్తుల సందర్శన నిలిపివేసిన రాష్ట్ర సర్కార్ ఈ నెల 8నుంచి తెరిచేందుకు అనుమతించింది.
60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయంలోనికి అనుమతి లేదని ఆలయ కార్యనిర్వహణాధికారిణి సునీత తెలిపారు. ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేవస్థాన గేటు వద్ద భక్తులను శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు జరగవని, అమ్మవారి దర్శనానికి మాత్రమే అనుమతుంటుందని సునీత తెలిపారు. సోమవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా ఆలయం తెరిచి ఉంటుందని చెప్పారు.
- ఇదీ చూడండి : 'కరోనమ్మా మమ్మల్ని కాపాడమ్మా' అంటూ పూజలు