ఉమ్మడి వరంగల్ జిల్లాలలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. అయితే గత రెండు రోజులతో పోలిస్తే మంగళవారం నాడు తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 117 కేసులు నమోదు కాగా... వరంగల్ అర్బన్ జిల్లాలో 34, వరంగల్ రూరల్ జిల్లాలో 20, మహబూబాబాద్ జిల్లాలో 27, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 27, జనగామ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.
ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల 30 నిమిషాలలోపే ఫలితాలు వెలువడుతున్నాయి.
కరోనా వైరస్ బారిన పడిన బాధితుల కుటుంబ సభ్యులు... కాంటాక్టుల్లో లక్షణాలు కనిపించి నట్లయితే వైద్య బృందాలు వారి ఇంటి వద్దకు వెళ్లి మరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
పరీక్షల్లో పాజిటివ్ వస్తే... బాధితులను హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఉష్ణోగ్రతను చూసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి