వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత తనిఖీ చేశారు. సబ్ సెంటర్‌లో మందులను పరిశీలించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా రోగులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలని వైద్యులను కోరారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి