ETV Bharat / state

Bhatti Vikramarka: 'అమిత్‌ షా వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు' - అమిత్‌షా కామెంట్స్‌పై భట్టివిక్రమార్క రియాక్షన్

Bhatti Vikramarka Padayatra: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి లౌకిక వాద వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. స్మార్ట్ సిటీ చేస్తామన్న వరంగల్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By

Published : Apr 25, 2023, 7:13 PM IST

Bhatti Vikramarka Padayatra: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న 'పీపుల్స్‌ మార్చ్‌' పాదయాత్ర ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం పాదయాత్రలో భాగంగా విశ్రాంతి సమయంలో మాట్లాడిన భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Bhatti vikramarka reaction to Amit Shah comments: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తాను ప్రమాణం చేసిన భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని మండిపడ్డారు. దానివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. స్మార్ట్ సిటీ చేస్తామన్న వరంగల్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. 54శాతం ఉన్న బహుజనులకు బడ్జెట్‌లో మొండి చెయ్యే ఎదురవుతుందని ఆరోపించారు.

సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోరాటాలు సాంధించి తెచ్చుకున్న తెలంగాణ 4 కోట్ల మంది కోసమని.. ప్రభుత్వంలో కొంత మందికి కాదని విమర్శించారు. దేశంలో జనగణన మొదలుపెట్టి దాని ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. అంతకు ముందు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు తగు సూచనలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం చదువును, ఉద్యోగాలను పక్కనపెట్టి పోరాటాలు చేశామని.. వాటిని సాధించుకునేంతవరకు నిలబడి మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో పేదలకు పంచిన భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని.. యూనివర్సిటీలు ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు.

"అమిత్‌షా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు. స్మార్ట్ సిటీ చేస్తామన్న వరంగల్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తెలంగాణలో 54శాతం ఉన్న బహుజనులకు బడ్జెట్‌లో మొండి చెయ్యే ఎదురవుతోంది. సంవత్సరానికి 2కోట్ల ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి"- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Bhatti Vikramarka: 'అమిత్‌ షా వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు'

ఇవీ చదవండి:

Bhatti Fires On Amit shah: 'బీజేపీ, బీఆర్​ఎస్ ఆటలు సాగనివ్వం'

Batti Padayatra: "మేము అధికారంలోకి వస్తే గ్యాస్​ సిలిండర్​ రూ.500లకే ఇస్తాం"

KTR: 'పార్టీ పేరు మాత్రమే మారింది.. డీఎన్​ఏ అలానే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.