మేడారం జాతర (medaram jatara 2021)కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా కృషిచేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాము. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాము. వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం పనులు తుది దశలో ఉన్నాయి. రామప్ప, ఖిలావరంగల్ కోటను అభివృద్ధి చేస్తాము. మేడారం జాతరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తాము. టూర్ ఆపరేటర్లకు రూ.10లక్షల రుణాలు అందిస్తాము.
-కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
కొవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో పర్యటక రంగానికి అండగా నిలిచేందుకు టూర్ ఆపరేటర్లకు బ్యాంకుల ద్వారా రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. పర్యటక హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం పనులు చివరి దశకు చేరాయని.. రామప్పతో పాటు ఖిలావరంగల్ కోటను పర్యటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామని కిషన్‌రెడ్డి వివరించారు.
ఇదీ చూడండి: రామప్పను ప్రపంచం గుర్తించింది... మేడారం జాతరను కేంద్రం గుర్తించలేదా..?
Medaram Jatara 2022: సమ్మక్క ఇవేం రోడ్లక్క.. మా మొర నీవైనా ఆలకించు సారక్క!