పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా చేపట్టిన జన జాగరణ ర్యాలీలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టం దేశంలో ఉన్న అన్ని వర్గాలకు వర్తిస్తుందని ఏ ఒక్క కులానికి అనుకూలం కాదని మాజీ శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అన్ని కులాలను.. మతాలను కలుపుకు పోయే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని భాజపా నాయకులు తెలిపారు.
ఇవీ చూడండి: కేసీఆర్ వెంట మంత్రి ఈటల కుటుంబం...