52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల గ్రంథాలయంలో వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బొచ్చు వినయ్ అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.
పరకాల ఏసీపీ శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. గ్రంథాలయాలు భవిష్యత్ దిక్సూచీలని ఏసీపీ పేర్కొన్నారు. గ్రంథాలయం వల్ల సమాజంలో అత్యున్నతమైన నైతిక విలువలు గల పౌరులు రూపుదిద్దుకుంటారని అన్నారు.
పుస్తక పఠనం మనిషి జీవన శైలికి మేదస్సు అభివృద్ధికి కొలమానాలని గండ్ర జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం'