తక్కువ సమయంలో నాణ్యతతో ముగిస్తారనే నమ్మకంతో రైతు వేదిక నిర్మాణ పనులను అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, అధికారులపై వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం చేతకాకపోతే ఇంకా విధుల్లో ఎందుకు కొనసాగుతున్నారని మండిపడ్డారు. వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో రైతు వేదిక నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు, అధికారులు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.
ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా దసరాలోగా రైతు వేదిక భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్ యాస్మిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.