వనపర్తి పట్టణంలోని బాలసదన్ను జిల్లా పాలనాధికారి షేక్ యాస్మిన్ బాషా సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలకు దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా బలంగా ఉండేందుకు ఐరన్ టానిక్ సీసాలను అందించారు. వేసవిలో పిల్లలకు చర్మ సంబంధమైన జబ్బులతో పాటు ఇతర జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
పిల్లలు మంచి పౌరులుగా తయారయ్యేందుకు మంచి కథలు, స్ఫూర్తివంతమైన పుస్తకాలను చదివించటంతోపాటు, సినిమాలను చూపించాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పోషకాహారాన్ని ఇవ్వాలని అని చెప్పారు. ఈ సందర్భంగా పాలనాధికారి పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ భోజనం ఎలా పెడుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసులు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.