తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని డిపో ఎదుట నిరసన తెలిపేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. కానీ డిపో ముందు భాగంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కార్మికులు అక్కడే ఆగి నిరసన చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ క్రమంలో కార్మికులు నినాదాలు చేస్తూ పరుగులు తీయడం వల్ల పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు.
ఇవీ చూడండి: 'మిషన్' పూర్తి చేసిన పీఎస్ఎల్వీ.. కక్ష్యలోకి కార్టోశాట్-3