ETV Bharat / state

చదువుకోవడానికి అన్నీ ఉన్నాయి.. తరగతి గదులు తప్ప...

అక్కడ చదువుకోవడానికి విద్యార్థులున్నారు. చదువు చెప్పడానికి ఉపాధ్యాయులున్నారు. కానీ విద్యార్థులు కూర్చోవడానికి తరగతి గదుల్లేవు. అన్ని సౌకర్యాలు ఉంటేనే అది పాఠశాల అవుతుంది. కానీ ఇక్కడ ఎండొచ్చిన.. వానొచ్చిన విద్యార్థులకు నిలువ నీడ లేదు.

author img

By

Published : Nov 16, 2019, 5:06 PM IST

తరగతి గదుల్లేని పాఠశాల
తరగతి గదుల్లేని పాఠశాల

వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం శేర్​పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శేర్​పల్లిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మొత్తం 106 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. బోధించడానికి నలుగురు ఉపాధ్యాయులు ఉండగా... గ్రామస్థులు అందరూ కలిసి ఇంకో ఇద్దరు ప్రైవేటు విద్యావాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు.

తరగతి గదులే లేవు...

పాఠశాలలో ప్రత్యేకంగా వంటగది, విద్యార్థులకు సరిపోయినన్ని టాయిలెట్లు, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ ఉన్నాయి. కానీ విద్యార్థులు కూర్చోవడానికి మాత్రం తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల మొత్తంలో రెండు గదులు మాత్రమే ఉండగా... వాటిలో ఒకటి ప్రధానోపాధ్యాయుడి గది.. మిగతా గదిని రెండు భాగాలుగా చేసి రెండు తరగతులు నిర్వహిస్తున్నారు.

వర్షం వస్తే అంతే..

మిగతా తరగతులను ఆరు బయట వరండాలో చెట్ల కింద నిర్వహిస్తున్నారు. తరగతి గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసిన యువకులు.. గ్రామ పెద్దలతో చర్చించి చందా రూపంలో నగదు జమ చేసి తాత్కాలికంగా తడకలతో రెండు తరగతి గదులను ఏర్పాటు చేశారు. కానీ వర్షాకాలంలో.. తడక గదుల్లోకి కూడా నీరు రావడం వల్ల తరగతుల నిర్వహణ ఇబ్బందవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా స్పందించండి..

తరగతి గదుల కొరత ఉన్న మాట వాస్తవమేనని.. సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా.. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల గదులను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...

Intro:వనపర్తి జిల్లా , శ్రీరంగాపూర్ మండలం , శేర్ పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Body:ఆ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి .......తరగతి గదులు తప్ప
వరండాల్లో తరగతులు... తడకలలో చదువులు
వనపర్తి జిల్లా , శ్రీరంగాపూర్ మండలం , శేర్ పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
శేర్ పల్లి గ్రామం లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల కలదు. ఆ పాఠశాలలో మొత్తం 106 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి విద్యను అందించడానికి నలుగురు ఉపాధ్యాయులు ఉండగా, ఆ గ్రామస్తులు అందరూ కలిసి ఇంకో ఇద్దరిని ప్రైవేటుగా విద్యా వాలంటీర్లగా కూడా తీసుకున్నారు.
ఆ పాఠశాలలో ప్రత్యేకంగా వంటగది ,విద్యార్థులకు సరిపోయినన్ని టాయిలెట్లు , పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ ఉన్నాయి... కానీ విద్యార్థులు కూర్చోవడానికి మాత్రం తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు .
పాఠశాల మొత్తంలో రెండు గదులు మాత్రమే ఉండగా..... వాటిలో ఒకటి ప్రధానోపాధ్యాయుడి గది ,దానిలోనే సగభాగం తరగతి గదిని,మరియు ఇంకొక గదిలో ఒక్క తరగతిని నిర్వహిస్తున్నారు.
మిగతా తరగతులను ఆరు బయట వరండాలో ,చెట్ల కింద నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కానీ పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి గ్రామ యువకులు గ్రామ పెద్దలతో చర్చించే తలా కొంత చంద్ర రూపంలో జమ చేసి తాత్కాలికంగా తడకలతో 2 తరగతి గదులను ఏర్పాటు చేశారు.
వర్షాకాలంలో .. తడక గదులలోకి కూడా నీరు రావడంతో తరగతుల నిర్వహణ ఇబ్బంది అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకోవాలనే ఆసక్తి గల విద్యార్థులు విద్య నేర్పించే తపన గల అధ్యాపకులు ఉన్నప్పటికీ తరగతి గదులు లేకపోవడంతో తమ పిల్లలు సరైన విద్యను అందుకోలేక పోతున్నారని గ్రామస్తులు వాపోయారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... తరగతి గదుల కొరత ఉన్న మాట వాస్తవమేనని ,దానిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
బైట్..
1. ఈశ్వర్ రెడ్డి ... ప్రధానోపాధ్యాయుడు
2. చంద్రశేఖర్ ..... గ్రామ యువకుడు
3. శ్రీశైలం...... గ్రామస్తుడు
4. రాఘవేంద్ర.... విద్యార్థి ...4 వ తరగతి
5. వరలక్ష్మి.... 4వ తరగతి విద్యార్థిని

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.