వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుహాసిని రోడ్ షోలో పాల్గొన్నారు. తెదేపా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ అని అన్నారు. కేసీఆర్ పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారని.. కానీ అలాంటి ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి తెలుగుదేశం అభిమానుల సత్తా చూపాలని కార్యకర్తలను కోరారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో మైనర్బాలికపై అత్యాచారం