ETV Bharat / state

ప్రతిఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం: మంత్రి - దడవాయిల సమస్యలు పరిష్కరిస్తానన్న మంత్రి నిరంజన్​ రెడ్డి

మార్కెట్లలో పనిచేస్తున్న దడవాయిల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర దడవాయిల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు.

minster niranjan reddy attended for market workers meeting in wanaparthy district
దడవాయిల సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Jan 26, 2021, 10:37 PM IST

రాష్ట్రంలో దడవాయిల కోసం పక్కా ఇళ్లు నిర్మించేందుకు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని వ్యవసాయశాఖ మంత్ర సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాకేంద్రంలో దడవాయిల సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మార్కెట్లలో పనిచేస్తున్న తమ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అన్నారు.

దడవాయిల సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​ రెడ్డి

వనపర్తి పరిధిలో మొదటి విడతలోనే సంఘ సభ్యులు సూచించిన వారికి ఇళ్ల కేటాయింపు జరిపేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా జీవితంలో సమస్యలు సర్వసాధారణమని వాటిని పరిష్కరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దడవాయి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ సమక్షంలో పలువురు తెరాస పార్టీలో చేరారు. వారందరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చూడండి : పాడి పరిశ్రమపై చిన్నచూపు ఎందుకు..?: ఎంపీ కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.