వనపర్తి జిల్లా వ్యాప్తంగా 252 కోట్ల చేపపిల్లలను వదులుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి రుసుం తీసుకోవట్లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని శ్రీ రంగపురం మండల కేంద్రంలోని రంగసముద్రంలో మంత్రి చేప పిల్లలను వదిలారు. వ్యవసాయంతో సమాంతరంగా చేపల పెంపకం జరగాలనేది ముఖ్యమంత్రి కోరిక అని మంత్రి పేర్కొన్నారు. చేపలు నుంచి వచ్చే ఆదాయం వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం ఒకే విధంగా ఉండేలా ప్రయత్నించాలని సూచించారు. మత్స్యకారులకు వాహనాలు, మినీ మార్కెట్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారిని శ్వేతా మహంతి, జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు