ETV Bharat / state

'నీళ్లు ఎక్కువై నిండా మునిగిపోతున్నాం.. మమ్మల్ని ఆదుకోండి' - పంటలు మునిగిపోయి రైతుల అవస్థలు

అతివృష్టి అంటే ఇదేనేమో. నీళ్ల కోసం రైతులు పోరాటాలు చేస్తున్న పరిస్థితులు మనం ఇదివరకు చూశాం. కానీ నీళ్లు ఎక్కువై మా పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితులు ప్రస్తుతం చూస్తున్నాం. ఇంతకాలం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబాలను పోషించుకున్న రైతులు నేడు వ్యవసాయ కూలీలుగా మారి అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బీడుగా ఉన్న వ్యవసాయ పొలాలకు సాగునీరు అందిందని సంతోషపడేలోగా.. అంతలోనే మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ విచిత్రమైన పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపించింది.

Crops in Water
పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన
author img

By

Published : Dec 21, 2021, 7:02 PM IST

ఏళ్ల తరబడి పోరాడి తెచ్చుకున్న నీళ్లు నేడు తమ పొలాలను ముంచెత్తి జీవనాధారం లేకుండా చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తమ పొలాలు నీటిలో మునిగిపోయి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 మంది అన్నదాతలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే.

వనపర్తి జిల్లా పరిధిలోని ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం చెరువు గతంలో కేవలం కొంత మాత్రమే నిండేది. దీంతో చెరువు వెనుక గల ఆయకట్టు రైతులు, చెరువు ముందున్న పట్టాదారులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే 2017లో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నిర్మించిన ప్రధాన కాలువకు గోపాల్‌పేట మండలం బుద్ధారం గ్రామం వద్ద నిర్మించిన బ్రాంచ్ కెనాల్ ద్వారా వనపర్తి, పెద్దమందడి, ఖిల్లా గణపురం మండలాలకు సాగునీరు అందింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా వచ్చే కృష్ణా జలాలతో ఖిల్ల గణపురం మండలకేంద్రంలోని ఘనపసముద్రం చెరువును అధికారులు పూర్తిగా నింపేశారు.

పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన

'నాకున్న పొలం ఐదెకరాలు మునిగిపోయింది. చెరువులో నిండా నీళ్లు ఉంచడం వల్ల పంట మొత్తం నాశనమైంది. బంగారు తెలంగాణ నీళ్లు తెచ్చి మమ్మల్ని ముంచిండ్రు. మాకు జీవనోపాధి లేదు. ఎక్కడికెళ్లాలో అర్థం కావడం లేదు.' - సంతోశ్ కుమార్, ఖిల్లా గణపురం రైతు

'మాకు ఇక్కడ మూడున్నర ఎకరాలు ఉంది. ఇక్కడ పొలం నాటుకుంటున్నాం. ఎప్పుడూ పొలం మునిగిపోతోంది. ఇంతకు ముందు కూరగాయలు పెట్టుకునే వాళ్లం. కరవు పనికి వెళ్తే మాకు ఇళ్లు గడవదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.' - పద్మ, మహిళా రైతు, ఖిల్లా గణపురం

నీళ్లు ఎక్కువై నీటమునిగిన పొలాలు

చెరువులో గతంలో తూము వద్ద 10 నుంచి 15 అడుగుల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం నేడు 28 అడుగులకు చేరడంతో చెరువు వెనుక ఉన్న 586 ఎకరాలు పూర్తిగా చెరువు నీటిలో మునిగిపోయాయి. పొలంలో తవ్వుకున్న బోరు బావులు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు, నియంత్రికలు సైతం నీటిలో మునిగి పోవడంతో జీవనాధారమైన భూమిని వదిలేసి వ్యవసాయ కూలీలుగా మారామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న పొలాల్లో వరితోపాటు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లితోట, వంగతోటలను సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారమని చెబుతున్నారు. చేసేదేమీ లేక బ్రతుకు దెరువు కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా రైతులు వాపోతున్నారు.

'చెరువు నీళ్లు ఇరిసిండు. కానీ సగానికే పెట్టాలి నీళ్లు. చెరువులో ఉన్న వాళ్ల పొలమంతా మునిగిపోయింది. నాకు నాలుగెకరాల భూమి ఉంది. చెరువుకట్ట తెంపితేనే మాకు మేలు జరుగుద్ది. మాకు చెరువు వెనక భూమి లేదు. కౌలు భూములు చేస్తే కూలీలన్న రావాలి కదా. ఇప్పుడు ఏం పని లేక మేమే కూలీలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది.' - సుమతి, మహిళా రైతు, ఖిల్లా గణపురం

నిరంజన్‌ రెడ్డి హామీ ఇచ్చి పట్టించుకోలేదు

చెరువు నీటితో ముంపునకు గురవుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి నిరంజన్‌ రెడ్డి హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎండాకాలంలో నీరు తక్కువగా ఉందన్న కారణంతో తమ పొలాల్లో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే పంటలు సైతం నీటిలో మునిగిపోతున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఏదైనా ఉపాధి చూపిస్తే చేసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందరికో పనులు కల్పించిన తామే కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు వేడుకుంటున్నారు.

'ఘనపసముద్రంలో మాకు రెండెకరాల భూమి ఉంది. చెరువు నిండా నీళ్లు నింపడంతో పంట మొత్తం మునిగిపోయింది. రైతులం కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ తోట భూములే సర్. వరిపంట వేసుకుని దీనిపైనే ఆధాప పడినాం. మంత్రి నిరంజన్‌ రెడ్డి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పట్టించకోలేదు.' - బాలరాజు, రైతు , ఖిల్లా గణపురం

80 కోట్ల ప్రతిపాదనలు

ఘనపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి రూ.80 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని అధికారులు తెలిపారు. అందులో నీటి ముంపునకు గురైన రైతులకు పరిహారంగా రూ.25 కోట్లు మంజూరు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.