ETV Bharat / state

దుకాణాలకు చేరుకోని సన్నాలు.. కరువైన స్పష్టత - wanaparthy dist latest news

కొవిడ్‌ ప్రభావంతో ఎనిమిది నెలలుగా రేషను కార్డుదారులకు ప్రభుత్వం ఒక్కో సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఈనెల నుంచి ఉచిత పంపిణీకి చరమగీతం పాడనుంది. పాత విధానంలోనే రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేయనుంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్‌ రేషను కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించనున్నట్లు తాజాగా ప్రకటన చేశారు. ఇందుకోసం అన్ని చౌకధరల దుకాణాలకు సన్నాలను సరఫరా చేయడానికి పౌరసరఫరాల శాఖ సన్నద్ధమైంది. సన్నబియ్యం ఈనెలలో అందుతాయా లేదా అనే సందేహం కార్డుదారుల్లో నెలకొంది.

దుకాణాలకు చేరుకోని సన్నాలు.. కరువైన స్పష్టత

author img

By

Published : Dec 3, 2020, 10:20 AM IST

Updated : Dec 3, 2020, 10:47 AM IST

వనపర్తి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌ నెలకు గాను 31,07,654 క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది. ఇప్పటికే జిల్లాలోని డీలర్లు నవంబర్‌ నెల 21 వరకు డీడీలు తీశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం కొత్తగా రేషను దుకాణాల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విధానపరమైన నిర్ణయం జరగలేదని సమాచారం. ఈనెల సన్న బియ్యం ఇస్తారో లేదో స్పష్టత రాలేదు. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం పాతవైతే క్వింటాకు రూ.4వేలకు పైగా ఉండటంతో రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తే ఆదరణ చూరగొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

జాప్యంతో గందరగోళం..

గతంలో ప్రతి నెలా 25వ తేదీలోగా తర్వాతి నెలకు సంబంధించిన బియ్యం దుకాణాలకు చేరుకునేవి. ఈసారి డిసెంబరులో పంపిణీ చేయాల్సినవే ఇంకా రాలేదు. దీంతో పంపిణీ ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నవంబరు చివరి వరకు సన్నబియ్యం పంపిణీపై డీలర్లకు స్పష్టత లేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారా, లేకుంటే పాత విధానంలో దొడ్డు బియ్యం ఇస్తారో తెలియడంలేదు. జిల్లాలో కొంతమంది డీలర్లను బియ్యం పంపిణీ విషయమై ‘ఈటీవీ భారత్​’ అడగగా మంగళవారం నాటికి డిసెంబర్‌ కోటాకు సంబంధించి దొడ్డు బియ్యమే వచ్చినట్లు చెబుతున్నారు. జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ ఉంటుందేమో అని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా స్పష్టత రాలేదు

ఈనెలలో సన్నబియ్యం పంపిణీ చేస్తారా లేదా అనే విషయంలో మాకు సమాచారం లేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయం మేరకు తెలుస్తుంది. డీలర్లు మాత్రం ఇప్పటికే డీడీలు తీసి బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా పంపిణీ ఉంటుంది. - రోజారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి.

ఇవీ చూడండి: మద్దతు ధర పెంచాలని రోడ్డుపై బైఠాయింపు.. ధాన్యానికి నిప్పు

Last Updated : Dec 3, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.