ETV Bharat / state

తాండూరులో రోడ్లు అధ్వానం.. రోడ్డెక్కిన యువతరం

తాండూరులో రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ఆర్​బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ అన్నారు. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా యువకులు ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

youth-dharana-for-road-problems-at-tandur
పార్టీలకతీతంగా యువత ఆందోళన
author img

By

Published : Jan 16, 2021, 4:56 PM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్లు అధ్వానంగా ఉండటంచే కాలుష్యం తీవ్రత పెరిగిపోతుందని యువత ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన చేశారు. స్థానికంగా రోడ్లు అధ్వానంగా మారాయని.. ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆర్​బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

youth-dharana-for-road-problems-at-tandur
పార్టీలకతీతంగా యువత ఆందోళన

స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని యువకులు అన్నారు. ఈ తరుణంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పట్టణంలోని శివాజీచౌక్​లో యువకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యువకుల ఆందోళనతో మహబూబ్​నగర్​ చించోలి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి : కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.