ETV Bharat / state

గడువులోగా పనులు పూర్తిచేయకుంటే బిల్లులు ఇచ్చేది లేదు: కలెక్టర్​ - Vikarabad Collector Pousami Basu latest news

కొడంగల్​లో పారిశుద్ధ్య పనుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి పౌసమి బసు అన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ వసతిగృహాన్ని గడువులోగా నిర్మించకుంటే బిల్లులను రద్దు చేస్తామని గుత్తేదారును హెచ్చరించారు. ​

Villages under the Kodungal Municipality inspected by Vikarabad Collector Pousami Basu
గడువులోగా నిర్మించకుంటే బిల్లులను రద్దు చేస్తాం
author img

By

Published : Jun 23, 2020, 5:46 PM IST

వికారాబాద్​ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్​ పౌసమి బసు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో చెత్తా, చెదారం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు పక్కల ఆటోలు నిలుపకుండా బస్టాండ్​లో కొంత స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్​ కమిషనర్​ను ఆదేశించారు.

పట్టణంలో నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ వసతిగృహాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల గురించి గుత్తేదారును అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా నిర్మించకుంటే బిల్లును రద్దు చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ నెల చివరి నాటికి వసతిగృహం అందుబాటులోకి వచ్చేలా పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్​ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.